e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

బజార్ హత్నూర్‌లో 50 కిలోల ప్రత్తి చోరీ.. రూ.4 వేల విలువైన పంట మాయం

ప్రత్తి చోరీ కేసులో నిందితుడి అరెస్ట్.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

బజార్ హత్నూర్‌లో 50 కిలోల ప్రత్తి చోరీ.. రూ.4 వేల విలువైన పంట మాయం

మన భారత్, బజార్ హత్నూర్:

బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ప్రత్తి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వ్యవసాయ పొలంలో నిల్వ ఉంచిన ప్రత్తిని దొంగిలించిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చెందిన గుండు మహేందర్ తన వ్యవసాయ పొలంలో నవంబర్ 22వ తేదీ ఉదయం సుమారు 1.50 క్వింటాళ్ల ప్రత్తిని దించి, రాత్రి కావడంతో పంటను పొలంలోనే ఉంచాడు. మరుసటి రోజు నవంబర్ 23వ తేదీ ఉదయం సుమారు 9 గంటలకు పొలానికి వెళ్లి పరిశీలించగా, అందులోని 50 కిలోల ప్రత్తి మూట కనిపించలేదు. చోరీకి గురైన ప్రత్తి విలువ సుమారు రూ.4 వేలుగా బాధితుడు గుర్తించాడు.

దీంతో బాధితుడు బజార్ హత్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు Cr.No.162/2026, సెక్షన్ 303(2) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మంకాపూర్ గ్రామానికి చెందిన కుంటల్ వార్ దుర్గాజీ (30)ని నిందితుడిగా గుర్తించి నవంబర్ 24వ తేదీన అరెస్ట్ చేశారు.

అనంతరం నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. చోరీకి గురైన ప్రత్తిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి: పోలీసులు

రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు, విలువైన వస్తువులను పొలాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో రాత్రి వేళల్లో నిర్లక్ష్యంగా వదిలివేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బజార్ హత్నూర్ పోలీసులు సూచించారు. గ్రామాలు, పొలాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపించినా, చోరీ ఘటనలు జరిగినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ వివరాలను బజార్ హత్నూర్ ఎస్సై కె. అఖిల్ వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE