ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం..

Published on

-Advertisement-

మన భారత్ | తలమడుగు :

తలమడుగులో ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం..

పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు నిర్వహణ

తలమడుగు మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మందకృష్ణ మాదిగ 61వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

కార్యక్రమంలో మాట్లాడిన మండల నాయకులు, 1994లో ప్రారంభమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మూడు దశాబ్దాలకు పైగా సామాజిక న్యాయం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, మాదిగల హక్కుల సాధన కోసం నిరంతర ఉద్యమం కొనసాగించిందన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన ఉద్యమం మాదిగ సమాజంలో చైతన్యం తీసుకువచ్చి, సామాజిక సమానత్వ సాధనలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.

రిజర్వేషన్ల పరిరక్షణ, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మందకృష్ణ మాదిగ చేసిన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నాయకులు కొనియాడారు. సమాజ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం ఆయన ఇదే స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో గోంటిముక్కుల ప్రేమేందర్, శివ, అరవింద్, రూపేందర్, అశోక్, రాజు, అక్షయ్‌తో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

More like this