ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్ఐ దేవేందర్

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక అవగాహన..

నాలుగు రోజుల్లో 110 మందికి కౌన్సెలింగ్ నిర్వహించిన ఆదిలాబాద్ పోలీసులు

మన భారత్: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల సంభవించే రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా, వారి ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (TTI)లో ప్రత్యేక కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రణయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, గత నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 110 మంది వాహనదారులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిరోజూ కేసుల్లో పట్టుబడిన వారిని టిటిఐకి తీసుకువచ్చి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, ట్రాఫిక్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వీడియో ప్రదర్శనలు, కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కేవలం వాహనదారుడి ప్రాణానికే కాదు, రహదారిపై ప్రయాణించే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుందని అన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా జీవితాంతం బాధ కలిగించే ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు.

మద్యం సేవించిన పరిస్థితిలో స్వయంగా వాహనం నడపకుండా కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయం తీసుకోవాలని లేదా ప్రజా రవాణా సేవలను వినియోగించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం చట్టరీత్యా శిక్షార్హమైనదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, కేవలం శిక్షలు విధించడం కాకుండా అవగాహన ద్వారా బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాటు పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పిలుపునిచ్చారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ దేవేందర్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

More like this

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...