కిడ్నాప్ యత్నం కేసులో ఇద్దరు అరెస్ట్..

Published on

-Advertisement-

జైనథ్ పోలీసుల చాకచక్యంతో నిందితుల పట్టివేత

జైనథ్, మన భారత్:

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో మహిళను మోసపూరితంగా తీసుకెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జైనథ్ సీఐ జి. శ్రావణ్ వెల్లడించారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళను నమ్మించి బైక్‌పై తీసుకెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన జైనథ్ పోలీసులు నిందితులు అశోక్ భూమన్న బట్టవార్, సంజీవ్ నాగోరావ్ నవలేలను గుర్తించి అరెస్ట్ చేశారు.

అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల వద్ద నుంచి కిడ్నాప్ యత్నానికి ఉపయోగించిన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ప్రజలు ముఖ్యంగా మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ జి. శ్రావణ్ సూచించారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీ చేరికలు..

గెర్జామ్‌లో 300 మంది పార్టీలో చేరిక.. కండువాలు కప్పి ఆహ్వానించిన రాథోడ్ బాపురావు మన భారత్, బోథ్:ఆగస్టు 26: బోథ్ నియోజకవర్గంలో తెలంగాణ...

మోసం చేసిన నిందితుడి అరెస్టు..

ఆటో డ్రైవర్‌ను మాటల్లో పెట్టి ఫోన్‌పే ద్వారా రూ.17 వేలు కాజేత మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో...

ఫ్రీ కుట్టు మెషీన్లు.. మీరు దరఖాస్తు చేసుకున్నారా.?

ఫ్రీగా కుట్టు మెషీన్లు.. బీసీ మహిళలు దరఖాస్తు చేసుకున్నారా? మన భారత్, ఆగస్టు ,25: బీసీ మహిళలకు స్వయం ఉపాధి...

పర్యావరణాన్ని కాపాడండి: సర్పంచ్ వెంకన్న

కుచులాపూర్‌లో మొక్కలు నాటిన సర్పంచ్ మోడేపు వెంకన్న మన భారత్, ఆగస్టు,25, తలమడుగు: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని...

More like this