e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు..

ఉద్యోగాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరాశాజనకం: జోగు రామన్న

బీఆర్ఎస్‌లోకి సుమారు 100 మంది యువకుల చేరిక

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 18,యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న విమర్శించారు. ఉద్యోగాల కల్పన పేరుతో యువతకు హామీలు ఇచ్చి వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో జోగు రామన్న పాల్గొన్నారు. రవీంద్రనగర్‌కు చెందిన ఆకర్ష్, శివతేజలతో పాటు సుమారు వందమంది యువకులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జోగు రామన్న పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే హామీలకు అనుగుణంగా ఉద్యోగాల కల్పన జరగడం లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఉద్యోగాల హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జోగు రామన్న అన్నారు. పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటుపై తగిన దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు.

ఆదిలాబాద్‌లోని సీసీఐ పరిశ్రమ అంశాన్ని ప్రస్తావిస్తూ.. పరిశ్రమను కొనసాగించేందుకు, పునరుద్ధరించేందుకు ప్రభుత్వాలపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ నియోజకవర్గంలో సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్‌లోని సీసీఐ పరిశ్రమను తుక్కు కింద విక్రయించడం బాధాకరమని జోగు రామన్న పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపైనా ఆయన విమర్శలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని, ఆయన తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని జోగు రామన్న అన్నారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అలాల్ అజయ్, ఫ్లోర్ లీడర్ వెనగంటి ప్రకాష్, వెంకటేష్, పండ్ల శ్రీనివాస్, మెట్టు ప్రసాద్, రాజన్న, సాజిత్ ఉద్దీన్, దాసరి రమేష్, అన్నెల వసంత్, దమ్మపాల్, కొండ గణేష్, దయానంద్, సృజన్, దివిటి రాజు, సురేందర్, బొట్టు సంతోష్, ప్రశాంత్, కలీం తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE