కిడ్నాప్ యత్నం కేసులో ఇద్దరు అరెస్ట్..
జైనథ్ పోలీసుల చాకచక్యంతో నిందితుల పట్టివేత జైనథ్, మన భారత్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో మహిళను మోసపూరితంగా తీసుకెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జైనథ్ సీఐ జి. శ్రావణ్ వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళను నమ్మించి బైక్‌పై తీసుకెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై...