మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: SI గణేష్

Published on

-Advertisement-

బంగారు ఆభరణాల విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి

మన భారత్, విజయనగరం: 

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని తంగుడబిల్లి గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులతో నెల్లిమర్ల ఎస్సై గణేష్ సమావేశం నిర్వహించి మహిళల భద్రత, దొంగతనాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వేసవికాలంలో చాలామంది ఇంటి పైకప్పులపై నిద్రిస్తున్న సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగదు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

అలాగే ఈవ్‌టీజింగ్, వేధింపులు లేదా మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగితే మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులకు, మహిళలకు సూచించారు. మహిళల రక్షణ, భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్సై గణేష్ స్పష్టం చేశారు.

సమాజంలో మహిళలకు చట్టపరంగా అనేక రకాల రక్షణలు ఉన్నాయని, ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా పోలీస్ స్టేషన్, 112 అత్యవసర హెల్ప్‌లైన్ లేదా 181 మహిళా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్‌లో “శక్తి యాప్” డౌన్‌లోడ్ చేసుకుని అవసర సమయంలో ఉపయోగించుకోవాలని సూచించారు.

అలాగే ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై కూడా శ్రద్ధ వహించాలని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

More like this