అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

Published on

-Advertisement-

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

మన భారత్, మొగుళ్ళపల్లి:

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ ఫెలోషిప్ జాతీయ అవార్డు గ్రహీత AYS రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య విచ్చేసి మాట్లాడుతూ ..దేశ రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామాలలో దళితులపై దాడులు దౌర్జన్యాలు అవమానాలు రోజురోజుకీ పెరిగి పోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నందున అంబేద్కర్ యువజన సంఘాన్ని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వారికి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, ఆశయాలను రాజ్యాంగం గురించి తెలియజేస్తూ ముందు తీసుకురావాలన్నారు. దళితులకు SIR గురించి తెలియజేసి బిఎల్ఓ ల దగ్గరికి తీసుకెళ్లాలన్నారు ,కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు రిజర్వేషన్లు ఓటు హక్కుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. ఆ మహనీయుని ఆశయాలు కొనసాగించుటకు కృషి చేయాలన్నారు.అనంతరం అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు గ్రహీత డాక్టర్ జేబీ రాజు అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ ఆవిలయ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా అందరూ సభ్యత్వాలు తీసుకోవాలని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు మేధావులు ఉద్యోగులు కుల మతాలకు అతీతంగా అందరూ సభ్యత్వం తప్పనిసరి తీసుకోవాలన్నారు. సభ్యత్వ రుసుము 100 రూపాయలు ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సీనియర్ నాయకులు మంద సాంబయ్య,అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి రాజేందర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల భద్రయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అంతడుపుల సారంగపాణి ,అంబేద్కర్ సంఘం టేకుమట్ల మండల కన్వీనర్ మారపల్లి కొమురయ్య, జిల్లా నాయకులు బండారి రాజు, సంగీ రవి, కుమ్మరి సాంబయ్య, నంద సుధాకర్, మంద తిరుపతి, దర్శనాల చంద్రమౌళి, దొడ్ల సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this