సీఎం మనువడు బాసరలో అక్షరాభ్యాసం.!

Published on

-Advertisement-

తెలంగాణ, మన భారత్:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర క్షేత్రంలో తన మనువడు రేయాన్ష్ రెడ్డికి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం సతీమణి గీతా రెడ్డితో కలిసి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన సీఎం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఆలయ పండితులు సంజీవ్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం తన మనువడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై ఓనమాలు దిద్దించి విద్యారంభాన్ని చేశారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీఎం కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు, పండితులు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో విద్యారంభం చేయడం విశేషమైన సంప్రదాయంగా భావిస్తారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this