శివలింగాన్ని  ఇంట్లో పెట్టుకోవచ్చా..!

Published on

-Advertisement-

శివలింగాన్ని  ఇంట్లో పెట్టుకోవచ్చా..!?

మన భారత్, భక్తి: శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా పెట్టుకున్న‌ట్ల‌యితే ఏదో అరిష్టం జ‌రుగుతుంద‌ని, ఇంట్లో ఉంచుకోవ‌ద్ద‌ని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలంకరణ కోసం, సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు చేయనక్కర్లేదు. అయితే ఒక్కసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదు. భగవంతుని శక్తిని ఆవాహన చేసి పూజించిన త‌ర్వాత ఆ శక్తి విగ్రహంలో నిగూఢమై ఉంటుంది. అందులోనూ ప్రత్యేకించి శివలింగం గురించి చెప్పాలంటే ‘*లీనమర్థం గమయతీతి లింగః*’ అని అంటారు. అంటే సృష్టంతా వ్యాపించి ఉన్న శక్తులను, వాటి ప్రయోజనాలను సాధకులకు రాబట్టేది లింగం. అంతటి శక్తివంతమైన లింగానికి నిత్యపూజ చేయడం కనీస ధర్మం. నర్మదా బాణలింగాల వంటివీ ఇంటిలో ఉంచుకోవచ్చు. నిత్య పూజకు లోపం రానీయకూడదు. శివుడికి ఒక్కడికే నిత్య అభిషేకం చెప్పబడింది ” అభిషేక ప్రియ శివః” అన్నారు. కావున రోజూ శక్తి కొద్దీ భక్తీ లోపం కాకుండా అభిషేకం చేయగలిగితే చాలు. అభిషేకం అంటే కచ్చితంగా మంత్రాలూ అవీ చదవాలి అనుకునే అవసరం లేదు. శివ పంచాక్షరీ చదువుతూ కూడా అభిషేకం చేయవచ్చు. స్త్రీలు శివలింగమును పూజించరాదు ముట్టుకోవద్దు అనేవి కేవలం అపోహలే. అయితే సాలగ్రామ శివలింగమును మాత్రమే స్త్రీలు పూజించరాదు. మరి ఏది సాలగ్రామం ఏది నర్మదా బాణం అనేది దగ్గరలోని పండితుల సూచనతో తెలుసుకోగలిగితే సరిపోతుంది. శ్రద్ధగా శివపూజ చేయగలిగిన వారు ఇంటిలో శివలింగాన్ని నెలకొల్పి పూజించవచ్చు. కనీస పక్షంలో పంచోపచార పూజ చేసినా చాలు. ముందుగా దీపారాధన చేసుకోవాలి. కలశంలోని నీటిని గంగా గంగా గంగ అని అభిమంత్రించాలి. తరువాత స్వామిని ధ్యానం చేయాలి. ధ్యానం వాగర్దా వివసంప్రుక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే! జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ !! శ్రీ గంగా సహిత ఉమా మషేశ్వరాభ్యాం నమః ధ్యానం సమర్పయామి. అని అక్షితలు వేయాలి. స్నానం లింగమును పళ్ళెంలో పెట్టి స్నానం / అభిషేకం చేయండి. ( శివ పంచాక్షరి తో అభిషేకం చేయండి.) అభిషేకం అయ్యాక స్వామిని శుభ్రంగా తుడిచి మందిరంలో పెట్టి .. లం పృథ్వీ తత్వాత్మనే శ్రీ  నమః| గంధం పరికల్పయామి||  హం ఆకాశ తత్వాత్మనే శ్రీ  నమః| పుష్పాణి పరికల్పయామి|| ( సమయం ఉంటె స్వామి నామాలు చెప్పుకోండి )

Latest articles

బీజేపీ.. “అమ్మ పేరిట ఒక మొక్క”

ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు ‘అమ్మ పేరిట ఒక మొక్క’ కార్యక్రమంలో బీజేపీ...

డిపో మేనేజర్‌గా సాయన్న బాధ్యతలు..

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న బాధ్యతల స్వీకరణ ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం – నూతన డిపో...

ఇక పంచాయతీలపై ప్రత్యేక నిఘా.!

స్పెషల్ ఆఫీసర్‌గా నర్సింగులు నియామకం గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ – అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు మన భారత్,...

బదిలీపై వెళ్తున్న ఎస్ఐకి ఘన వీడ్కోలు..

ప్రజల మనసులు గెలుచుకున్న పోలీస్ అధికారి సేవలకు ప్రశంసల వెల్లువ మన భారత్, నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో...

More like this

బీజేపీ.. “అమ్మ పేరిట ఒక మొక్క”

ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు ‘అమ్మ పేరిట ఒక మొక్క’ కార్యక్రమంలో బీజేపీ...

డిపో మేనేజర్‌గా సాయన్న బాధ్యతలు..

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న బాధ్యతల స్వీకరణ ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం – నూతన డిపో...

ఇక పంచాయతీలపై ప్రత్యేక నిఘా.!

స్పెషల్ ఆఫీసర్‌గా నర్సింగులు నియామకం గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ – అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు మన భారత్,...