మొంథా తుఫాను ఎఫెక్ట్‌.. రాష్ట్రంలో 22 జిల్లాల విద్యార్థులకు సెలవులు

Published on

-Advertisement-

మొంథా తుఫాను ఎఫెక్ట్‌.. రాష్ట్రంలో 22 జిల్లాలకు స్కూల్, కాలేజీ సెలవులు
తీవ్ర గాలులు, భారీ వర్షాల హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం

మన భారత్, అమరావతి : మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఉధృతంగా మారింది. వర్షాలు, బలమైన గాలులు కొనసాగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే కాకినాడ జిల్లాలో ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు హాలిడేస్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి 1 నుండి 3 రోజుల వరకు సెలవులు ఇవ్వబడ్డాయి. తుఫాను తీరం దాటే సమయానికి భారీ వర్షాలు, గాలులు బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున, జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజా అంచనాల ప్రకారం, రేపు రాత్రి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 80–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరం వెంబడి మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తక్షణమే తీరానికి చేరుకోవాలని సూచించింది. అధికార యంత్రాంగం అన్ని జిల్లాల్లో తుఫాను సన్నద్ధత పనులను వేగవంతం చేస్తోంది. విద్యా శాఖ అధికారులు తెలిపారు. “విద్యార్థుల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యగా సెలవులు ప్రకటించాం. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తాం.”

— మన భారత్, ప్రత్యేక ప్రతినిధి

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this