1600 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి..
సింగసముద్రం,జక్కుల చెరువుల నుంచి సాగునీరు విడుదల చేయాలి. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని వినతి. మన భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాలకు జీవనాధారంగా ఉన్న సింగసముద్రం, జక్కుల చెరువుల నుంచి పంటల సాగు కోసం నీటిని విడుదల చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, స్థానిక తహసీల్దార్ దివ్యజ్యోతికి ఏఎంసీ చైర్మన్ మేడిపల్లి దేవానందం కాంగ్రెస్ నాయకులతో కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు....