e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తాం..

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తాం
– మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్
– రాజ్యాంగ విలువలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా పనిచేస్తాం
జగిత్యాల, నవంబర్ 26, మన భారత్ :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తూ, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా పనిచేస్తామని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అన్నారు. నవంబర్ 26 రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 16వ వార్డు కౌన్సిలర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ దుమాల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఇతర సంఘాల నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో చైర్ పర్సన్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసి, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహనీయుడని కొనియాడారు. రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ, హక్కుల ఫలితంగా ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ అన్న నాయకత్వంలో, మున్సిపాలిటీ తరఫున అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా, పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు తమ వంతు బాధ్యతగా ముందుండి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులకు, అంబేద్కర్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, కౌన్సిలర్లు మనపూరి పవిత్ర-మహేష్, బొల్లారపు స్వప్న-గిరిధర్, బడుగు పద్మ-రాజేందర్, ఎస్సీ,ఎస్టీ సభ్యుడు కురుసంగి వేణు, నక్క అశోక్, డిక్కీ జిల్లా అధ్యక్షుడు నల్ల శ్యామ్, చిత్తరి ప్రభాకర్, ఏఈ అశోక్ రాజ్, దుమాల గంగాధర్, ఏనుగందుల మోహన్, ఎస్సీ సెల్ నాయకులు, అంబేద్కర్, దళిత, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE