e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

వామన్ నగర్ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

వామన్ నగర్ అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నారాయణ బాబా ఆశ్రమం వద్ద రూ.10 లక్షలతో నిర్మించిన నూతన షెడ్డు ప్రారంభం

మన భారత్, తాంసి:నవంబర్ 26,

వామన్ నగర్ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు. వామన్ నగర్ గ్రామం తనకు ప్రత్యేకమైనదని, గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తాంసి మండలంలోని వామన్ నగర్ గ్రామంలో శ్రీ నారాయణ బాబా ఆశ్రమం వద్ద రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు గిరిజన సంప్రదాయ పద్ధతిలో డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమం వద్ద నూతనంగా నిర్మించిన షెడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొని గ్రామస్తులతో మాట్లాడారు.

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. వామన్ నగర్ గ్రామంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. నారాయణ బాబా గతంలో చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయని, గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

గ్రామంలో బస్సు సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అదేవిధంగా గ్రామానికి సంబంధించిన రహదారి సమస్యను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వామన్ నగర్ సర్పంచ్ తూర్పబయి యశ్వంత్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేమ శ్రీకాంత్, కేదారేశ్వర్ రెడ్డి, బోథ్ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE