e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చేరికలు..

ఉట్నూర్ (ఆదిలాబాద్), నవంబర్ 25:
ఉట్నూర్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం:
ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. తెలంగాణ మళ్లీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి రాబోయే రోజుల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధి కోసమే బీఆర్ఎస్‌లో చేరాం:
గతంలో కేసీఆర్ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల తమకు ఎంతో మేలు జరిగిందని పార్టీలో చేరిన గ్రామస్తులు తెలిపారు. భూక్యా జాన్సన్ నాయక్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ జైదీ ఉమర్” మన భారత్, జర్నలిస్టు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE