e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

దేవపూర్‌లో ట్రైనీ కలెక్టర్లకు ఘన సన్మానం

దేవపూర్‌లో ట్రైనీ కలెక్టర్లకు ఘన సన్మానం

నాలుగు రోజుల క్షేత్రస్థాయి శిక్షణ విజయవంతం.. గ్రామ పాలన, ప్రభుత్వ శాఖల పనితీరుపై అవగాహన

మన భారత్, తలమడుగు: నవంబర్ 25

తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించిన ట్రైనీ కలెక్టర్లకు బుధవారం ఘనంగా సన్మానం చేశారు. గ్రామ పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ట్రైనీ కలెక్టర్లు గ్రామంలో నాలుగు రోజులపాటు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణ చివరి రోజైన నవంబర్ 25న గ్రామ ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఆధ్వర్యంలో వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్, ఉపసర్పంచ్ మేకల శ్రీరాములు గ్రామం తరఫున ట్రైనీ కలెక్టర్లను సత్కరించి అభినందనలు తెలిపారు. నాలుగు రోజుల శిక్షణలో భాగంగా గ్రామంలోని పరిపాలనా విధానాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ శాఖల సమన్వయం, గ్రామస్థాయిలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన పొందారు.

ఈ కార్యక్రమంలో తలమడుగు మండల తహసీల్దార్ రాజమోహన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శంకర్, పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ హరీష్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి జి. వెంకట్రావు, హెచ్ఎం నరసయ్య, వెటర్నరీ వైద్యురాలు డాక్టర్ సరూప పాల్గొన్నారు.

అలాగే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయ, బీసీ వెల్ఫేర్ హెచ్‌డబ్ల్యూఓ నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి రాందాస్, గంగా ప్రసాద్, మండల ఏపీఎం శేఖర్, ఐసీడీఎస్ అధికారులు, గ్రామ వీఆర్ఏలు, అటవీ శాఖ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రమోద్ రెడ్డి, ఏఈఓ హర్ష, జూహి, పురసరఫరాల కేంద్రం ఎండీ మూసతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

నాలుగు రోజులపాటు గ్రామంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి ట్రైనీ కలెక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పాలనను మరింత సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ఈ క్షేత్రస్థాయి శిక్షణ ఉపయోగపడిందని పేర్కొన్నారు.

దేవపూర్ యూత్ అధ్యక్షుడు దాతజీ కిరణ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, వార్డు సభ్యుల సహకారంతో సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE