e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

47వ కొండగట్టు గిరిప్రదక్షిణకు హాజరైన ఎన్నారై భక్తులు

47వ కొండగట్టు గిరిప్రదక్షిణకు హాజరైన ఎన్నారై భక్తులు
జగిత్యాల/కొడిమ్యాల, నవంబర్ 24, మన భారత్ :
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని 47వ కొండగట్టు గిరి ప్రదక్షిణ మంగళవారం గిరి ప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మరామ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఇట్టి 47వ గిరిప్రదక్షిణలో వివిధ జిల్లాలు ,మండలాలు, గ్రామాల నుండి దాదాపు 30 వేల మంది హాజరైనారు. కొండగట్టు దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నది. కొండగట్టు గిరిప్రదక్షిణ వ్యవస్థాపకులు సురేష్ ఆత్మరామ్ మహారాజ్ మాట్లాడుతూ నేటికీ 47వ కొండగట్టు గిరి ప్రదక్షిణ పూర్తయిందని భక్తులు నీటి ప్రవాహం లాగా దాదాపు 30 వేల మంది హాజరైనారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గిరిప్రదక్షిణ వలన వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ గిరి ప్రదక్షిణ లో శ్రీనివాసుల సేవా సంస్థ అధ్యక్షులు ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి, ఎన్నారై లు సింగపూర్ లో నివసిస్తున్న బైరీ రవీందర్, వంకాయల శ్రీనివాస్,కోడిమ్యాల గ్రామ ప్రముఖులు ఏనుగు ఆదిరెడ్డి, సామ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ మార్గం ఆదిత్య, జర్నలిస్టు, జగిత్యాల జిల్లా 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE