e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

పేదల ఇళ్ల జోలికొస్తే సహించేది లేదు : మాజీ మంత్రి జోగు రామన్న

పేదల ఇళ్ల జోలికొస్తే సహించేది లేదు – మాజీ మంత్రి జోగు రామన్న

ఖానాపూర్ చెరువు బాధితులకు బీఆర్ఎస్ అండ.. కలెక్టరేట్ ఎదుట ధర్నా.. బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతి

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 23:

ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు పరిధిలో నివాసాలు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సోమవారం ఆందోళన చేపట్టింది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ఖానాపూర్ చెరువు అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ పనుల పేరుతో పేదల నివాసాలను తొలగించడం సరికాదని అన్నారు. చెరువు అభివృద్ధి జరగాలని, అదే సమయంలో అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాల జీవనోపాధి, నివాస భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇళ్లు కోల్పోతున్న బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కూల్చివేసే చర్యలకు ప్రభుత్వం పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన పోరాటం కొనసాగిస్తుందని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యేపై ఆరోపణలపై విచారణ ఏదీ?

స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై రూ.360 కోట్ల విలువైన భూముల కబ్జాకు సంబంధించి కాంగ్రెస్ నాయకులే ఆరోపణలు చేస్తున్నారని జోగు రామన్న ప్రస్తావించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన విమర్శలు చేశారు.

పేదల ఇళ్లపైనే బుల్డోజర్లు ఎందుకు?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జోగు రామన్న విమర్శించారు. చెరువుల ఆక్రమణలు, పేదల నివాసాల తొలగింపు అంశాల్లో ప్రభుత్వాలు ఒకే విధమైన విధానాన్ని అనుసరించాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనయుడికి సంబంధించిన నివాసంపై కూడా ఆరోపణలు ఉన్నాయని ప్రస్తావిస్తూ, వాటిపై చర్యలు తీసుకోకుండా పేదల ఇళ్ల విషయంలోనే కఠినంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఖానాపూర్ చెరువు అభివృద్ధి పనుల నేపథ్యంలో ఇళ్లు కోల్పోయే పరిస్థితి ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, వారి నివాసాలకు రక్షణ కల్పించాలని జోగు రామన్న డిమాండ్ చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, పండ్ల శ్రీనివాస్, యూనిస్ అక్బాని, సలీం పాషా, డాక్టర్ గౌస్, సాజితోద్దీన్, జాహుర్ సబ్, ఎజాజ్, అత్త ఉల్లాఖాన్, మోసిన్, సాగర్, జమీల్, అయ్యోబ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE