e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

కళాశాలలో DIEO కైసార్ పాషా ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక దిశానిర్దేశం

కళాశాలలో DIEO కైసార్ పాషా ఆకస్మిక తనిఖీ.. విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక దిశానిర్దేశం

మన భారత్, తాంసి:నవంబర్ 21,

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (DIEO) కైసార్ పాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యా బోధన, విద్యార్థుల హాజరు, సిలబస్ పూర్తి తదితర అంశాలను ఆయన పరిశీలించి అధ్యాపకులకు పలు సూచనలు చేశారు.

తనిఖీలో భాగంగా విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించి, ప్రతిరోజూ విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధ్యాపకులు తమ టీచింగ్ డైరీలను క్రమబద్ధంగా నిర్వహించాలని, నిర్ణీత గడువులోగా సిలబస్‌ను పూర్తిచేయాలని ఆదేశించారు. రాబోయే పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వెనుకబడిన విద్యార్థులపై అదనపు దృష్టి సారించి అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని లెక్చరర్లకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం ఓజేటీ (OJT) కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Primary Health Centre) సందర్శించారు. అక్కడ విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పనితీరును పరిశీలించి, వృత్తి విద్యా అధ్యాపకులను శిక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తరగతి గది బోధనతో పాటు క్షేత్రస్థాయి అనుభవం కూడా అందేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో DIEO కైసార్ పాషాతో పాటు సూపరింటెండెంట్ మోసిన్, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయభాస్కర్, స్టూడెంట్ కౌన్సిలర్ బి. ప్రవీణ్ కుమార్, వెంకటేష్, దేవేందర్, మల్లేష్, సంతోష్, కార్తీక్, శ్రీనివాస్, దేవికతో పాటు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE