e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఆదిలాబాద్ రింగ్ రోడ్డుకు అనుమతులు మంజూరు చేయండి

ఆదిలాబాద్ రింగ్ రోడ్డుకు అనుమతులు మంజూరు చేయండి

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి

ఎయిర్‌ఫీల్డ్, డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్లు, మెగా ఇండస్ట్రియల్ పార్కుకు రవాణా అనుసంధానంపై విజ్ఞప్తి

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కీలకమైన ప్రతిపాదిత రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) 85వ వార్షిక సమావేశం సందర్భంగా కేంద్ర మంత్రిని కలిసి జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రింగ్ రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కేంద్ర మంత్రికి వివరించారు. జిల్లాలో భవిష్యత్తులో ఏర్పాటు కానున్న జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్, డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్లు, రక్షణ రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, మెగా ఇండస్ట్రియల్ పార్కుకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

ఆదిలాబాద్ పట్టణం, పరిసర ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు రింగ్ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపాదిత పారిశ్రామిక పార్కుకు పెట్టుబడులు తరలిరావాలన్నా, పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడాలన్నా మెరుగైన రహదారి అనుసంధానం అవసరమని వివరించారు.

రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా సమయం తగ్గడంతో పాటు సరుకు రవాణా సులభతరం అవుతుందని, పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. తద్వారా జిల్లాలో పెట్టుబడులు పెరగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్‌ను ప్రధాన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రింగ్ రోడ్డు నిర్మాణం కీలకమైన మౌలిక సదుపాయంగా నిలుస్తుందని పేర్కొంటూ, ఈ ప్రతిపాదనను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి చేశారూ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE