e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

తెలంగాణ ఉద్యమకారుల గుండె చప్పుడు వినిపించేందుకు శోభారాణి పాదయాత్ర: కొండా దంపతులకు కలిపిన వేముల మహేందర్ గౌడ్

తెలంగాణ ఉద్యమకారుల గుండె చప్పుడు వినిపించేందుకు శోభారాణి పాదయాత్ర

కొండా దంపతులకు కలిపిన వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి: నవంబర్ 18, (మన భారత్):

తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఉద్యమకారులకు నేడు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ఒక చారిత్రాత్మక పాదయాత్రకు తెర లేచింది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తమ్మల శోభారాణి చేపట్టనున్న ఈ ఆత్మగౌరవ పాదయాత్ర వరంగల్ నుండి హైదరాబాద్ లోని గన్ పార్క్ వరకు సాగనుంది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం నాడు పోరాటం..ఆత్మగౌరవం, అధికార పదవుల కోసం నేడు కదం తొక్కుదాం అనేదే ఈ పాదయాత్ర ప్రధాన నినాదం..ఈ పాదయాత్ర విజయవంతం కావడం కోసం బుధవారం హన్మకొండలోని రామ్ నగర్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యమ నాయకురాలు శోభారాణిని నేరుగా తెలంగాణ ఉద్యమ నేతలు కొండా మురళీ, మాజీ మంత్రి కొండా సురేఖ దంపతుల వద్దకు తీసుకెళ్లిన ఘనత బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, కొండా యువసేన రాష్ట్ర నాయకుడు వేముల మహేందర్ గౌడ్ దే..వేముల మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మర్యాద పూర్వక భేటీలో కొండా మురళీ తమ్మల శోభారాణిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం శోభారాణి కొండా సురేఖకు పూల మొక్కను అందించి సత్కరించి, తన పాదయాత్రను ఆమె చేతుల మీదుగా ప్రారంభించాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ..తెలంగాణ కోసం జైలుకెళ్లినోళ్లు, లాఠీ దెబ్బలు తిన్నోళ్లు నేడు పదవులకు దూరంగా ఉన్నారని, వారికి రావాల్సిన గుర్తింపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్ర ప్రతి ఉద్యమకారుడి ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసిన వేముల మహేందర్ గౌడ్ కు ఉద్యమకారులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేడ్ల విజయ, కోడెపాక అన్నపూర్ణ, గీరబోయిన రాధిక, ఇంజె భావన, జూపాక ఇందిరా, ప్రమాదదేవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE