e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

బీజేవైఎం ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా కట్కం రాజేందర్ జెట్టి సృజన్ నియామకం

బీజేవైఎం ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా కట్కం రాజేందర్, జెట్టి సృజన్ నియామకం

నియామక ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కాళ్ల సాయి కృష్ణ

మన భారత్, ఆదిలాబాద్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆదిలాబాద్ జిల్లా కమిటీలో కీలక నియామకాలు చేపట్టారు. జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులుగా కట్కం రాజేందర్, జెట్టి సృజన్‌లను నియమిస్తూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కాళ్ల సాయి కృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, పాయల్ శరత్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన నాయకులకు నియామక బాధ్యతలు అప్పగించి శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ యువజన విభాగాన్ని జిల్లాలో మరింత బలోపేతం చేయడంతో పాటు యువతను రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు నూతన నియామకాలు దోహదపడతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను యువతలోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై యువ మోర్చా నాయకులు చురుకుగా పనిచేయాలని సూచించారు.

జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యతలు పొందిన కట్కం రాజేందర్, జెట్టి సృజన్ పార్టీ నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ యువ మోర్చా అభివృద్ధికి కృషి చేయాలని కార్యకర్తలు ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE