e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

భీంపూర్ మండలంలో 555 మందికి ఆసరా పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

భీంపూర్ మండలంలో 555 మందికి ఆసరా పెన్షన్ల పంపిణీ
లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, భీంపూర్:నవంబర్ 17,

అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంలో భాగంగా భీంపూర్ మండలంలో 555 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఆసరా పింఛన్లు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థికంగా ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పెన్షన్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 555 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందించడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు హాజరై పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు సిడం అశోక్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: గేడం రమాకాంత్ భీంపూర్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE