e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

చేయూత పింఛన్ల పంపిణీ చేసిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

బేలా మండలంలో ఘనంగా చేయూత పింఛన్ల పంపిణీ

ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి లబ్ధిదారులకు పింఛన్ కార్డులు అందజేసిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, బేలా:నవంబర్ 16,

ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా చేయూత పింఛన్లను అందిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బేలా మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం కాకుండా వారికి చేయూతనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పింఛన్ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.

ప్రతి నెలా ఆసరా, చేయూత పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం వల్ల వారి నిత్యావసర అవసరాలకు కొంతమేర భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన పేదలకు చేరేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు, స్పెషల్ ఆఫీసర్ మనోహర్, ఎంపీడీఓ మహేష్ కుమార్, జైనథ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, సర్పంచ్ భోక్రే శంకర్, రాందాస్ నక్లే, వామన్ వాంఖడే, రూప్రావ్, సంజయ్ గుండావర్, శాంతన్ తదితర నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింఛన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE