e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

జీవితంలో సుఖసంతోషాలతో ముందుకు సాగాలి: మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి

వివాహాలు, నిశ్చితార్థాలు, పొచ్చమ్మ కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 15, ఆదిలాబాద్ పట్టణంతో పాటు తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన వివాహాలు, నిశ్చితార్థాలు, సంప్రదాయ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి పాల్గొని ఆయా కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన జీవితంలో సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆనందపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి రవీందర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు, ఆదిలాబాద్ విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు యాదగిరి కుమారుని వివాహానికి హాజరయ్యారు. అలాగే రిటైర్డ్ ఎంఈఓ కొడిమల ఆశన్న మనుమడి వివాహ వేడుకలో, తలమడుగు ఎంపీపీ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఉమామహేశ్వరి వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అదేవిధంగా హస్నాపూర్ గ్రామానికి చెందిన కంది చక్రధర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఏ నలం సాంబశివి ఇంట్లో నిర్వహించిన పెండ్లి పొచ్చమ్మ కార్యక్రమంలో, బరంపూర్ గ్రామానికి చెందిన గాండ్ల రాజు ఇంట్లో నిర్వహించిన పొచ్చమ్మ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ తలమడుగు మండల అధ్యక్షుడు కస్లాల ప్రతాప్, మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, పట్నా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE