e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

రంగాపూర్ యువకుడి ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు-సమాచారం ఇవ్వండి:మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ విజ్ఞప్తి

రంగాపూర్ యువకుడి ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు-సమాచారం ఇవ్వండి: ఎస్ఐ ముప్పు సురేష్ విజ్ఞప్తి

మొగుళ్ళపల్లి: నవంబర్ 14, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో ఒక యువకుడి అదృశ్యం కలకలం రేపుతోంది. ఇంటి నుండి వెళ్లిపోయి మూడు నెలలు దాటినా ఇంత వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

*అసలేం జరిగిందంటే…*

రంగాపూర్ గ్రామానికి చెందిన రత్న కుమార్ (28), తండ్రి పైడి, కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత ఆగస్టు 5వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో కుటుంబంలో చిన్నపాటి గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కుమార్ కోపంతో ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. “కొద్దిసేపట్లో వస్తాడులే” అని తల్లిదండ్రులు ఎదురుచూశారు. సాయంత్రం అయినా రాలేదు. రాత్రి అయినా జాడ లేదు. దీంతో కంగారు పడిన తండ్రి పైడి బంధువుల ఇళ్లలో, స్నేహితుల వద్ద, చుట్టుపక్కల గ్రామాల్లో, భూపాలపల్లి, మొగుళ్ళపల్లి పరిసర ప్రాంతాలన్నీ జల్లెడ పట్టాడు. కానీ ఎక్కడా ఆచూకీ లభించలేదు. చివరకు చేసేదేమీ లేక నవంబర్ 14న మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు.

*పోలీసుల రంగప్రవేశం:*

తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ వెంటనే స్పందించారు. తప్పిపోయిన యువకుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ముప్పు సురేష్ మాట్లాడారు. “తప్పిపోయిన యువకుడు రత్న కుమార్ ఆచూకీ కోసం మా పోలీస్ శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అతడు లేత నీలం జీన్స్ ప్యాంటు, తెల్ల షర్టు ధరించి ఉన్నాడు. 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు, చామనచాయ రంగులో, గుండ్రటి ముఖంతో ఉంటాడు. ప్రజలు ఎవరైనా ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసినా, ఏ చిన్న సమాచారం తెలిసినా వెంటనే మా పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలి. మీరు ఇచ్చే చిన్న సమాచారం తల్లిదండ్రులకు తమ బిడ్డను తిరిగి అందించినట్లు అవుతుంది” అని విజ్ఞప్తి చేశారు. తప్పిపోయిన యువకుడి కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. “మా బిడ్డ ఏ తప్పు చేసినా క్షమించండి, ఎక్కడున్నా ఇంటికి తిరిగి రా నాయనా” అంటూ ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ను సంప్రదించగలరు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE