రంగాపూర్ యువకుడి ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు-సమాచారం ఇవ్వండి:మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ విజ్ఞప్తి
రంగాపూర్ యువకుడి ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు-సమాచారం ఇవ్వండి: ఎస్ఐ ముప్పు సురేష్ విజ్ఞప్తి మొగుళ్ళపల్లి: నవంబర్ 14, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో ఒక యువకుడి అదృశ్యం కలకలం రేపుతోంది. ఇంటి నుండి వెళ్లిపోయి మూడు నెలలు దాటినా ఇంత వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. *అసలేం జరిగిందంటే...* రంగాపూర్ గ్రామానికి చెందిన రత్న కుమార్ (28), తండ్రి పైడి,...