e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

పిల్లల రక్షణతో పాటు గర్భిణులకు పౌష్టికాహారం టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

బాలల హక్కులు, ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పించిన బాలల గ్రామసభ
పిల్లల రక్షణతో పాటు గర్భిణులకు పౌష్టికాహారం, టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

మన భారత్, తలమడుగు:నవంబర్ 14,

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామంలో బాలల హక్కులు, రక్షణ, ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు బాలల గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పిల్లలకు వారి హక్కులపై అవగాహన కల్పించారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, రక్షణ, సముచిత సంక్షేమ సదుపాయాలు అందాల్సిన అవసరాన్ని వివరించారు. బాలల పట్ల వివక్ష చూపకుండా వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాలల భద్రత విషయంలో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా అంగన్‌వాడీ సేవల్లో భాగంగా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. గర్భధారణ సమయంలో సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని, టీకాల షెడ్యూల్‌ను తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు.

గ్రామస్థాయిలో బాలల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో బాలల గ్రామసభలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పిల్లలకు విద్య, ఆరోగ్యం, భద్రతతో కూడిన వాతావరణం కల్పించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్కం సంజీవ్, గ్రామ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి బాలాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE