e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

చిన్నారి నామకరణ మహోత్సవానికి హాజరైన ఏఎంసీ చైర్మన్ బోరంచు

చిన్నారి నామకరణ మహోత్సవానికి హాజరైన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
పాపను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14,

అల్లూరి నయనతా శేఖర్ రెడ్డి మనవరాలు, అడ్డి అన్వేష్ రెడ్డి – ప్రణయ దంపతుల కుమార్తె నామకరణ మహోత్సవ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ వేడుకకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించి, ఆమెకు సుఖసంతోషాలతో కూడిన ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అడ్డి అన్వేష్ రెడ్డి, ప్రణయ దంపతులతో పాటు కుటుంబ సభ్యులకు నామకరణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈ శుభకార్యంలో పాల్గొన్న ఆయన, చిన్నారి కుటుంబంతో కొంత సమయం గడిపి వేడుకలో భాగస్వాములయ్యారు. నామకరణ వేడుకతో కుటుంబంలో నెలకొన్న ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో మావల సర్పంచ్ చంద్రశేఖర్, మావల మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుదురుపాక సురేష్ కుమార్, వార్డు సభ్యుడు ఎదురు వినోద్, రాజేందర్, కిరణ్, ఎన్‌ఎస్‌యూఐ మావల మండల అధ్యక్షుడు మార్సకోల గౌతమ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE