e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కలిసి భోజనం చేసిన సర్పంచ్ మోడెపు వెంకన్న

అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కలిసి భోజనం చేసిన సర్పంచ్ మోడేపు వెంకన్న

పిల్లలకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా.. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచన

మన భారత్, తలమడుగు:నవంబర్ ,12,

తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2ను గురువారం స్థానిక సర్పంచ్ మోడేపు వెంకన్న సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించి, పిల్లలతో కలిసి భోజనం చేశారు.

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రతిరోజూ అందిస్తున్న పౌష్టికాహారం, భోజన నాణ్యత, ఆహార పంపిణీ విధానం తదితర అంశాలపై అంగన్వాడీ టీచర్లు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, ప్రభుత్వం అందిస్తున్న అంగన్వాడీ సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా చిన్న వయస్సు ఉన్న పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ప్రాథమిక విద్య, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సేవలు అందేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.

అదేవిధంగా గర్భిణులు, బాలింతలకు నిర్ణీత సమయంలో పౌష్టికాహారం అందించడంతో పాటు అవసరమైన వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు సక్రమంగా అందేలా చూడాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. తల్లులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోడేపు వెంకన్న, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE