e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

552 మందికి ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ..

బోథ్ మండలంలో 552 మందికి ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, బోథ్:నవంబర్ 12,

పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుందని, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థికంగా తోడ్పడుతుందని ఆయన అన్నారు.

బోథ్ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 552 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆసరా పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్‌ (కార్డులు) అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలోని అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆసరా పెన్షన్ పథకం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర అర్హులైన వర్గాలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం అందడం వల్ల వారి జీవనానికి కొంత భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అర్హులైన వారు ఎవరూ నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అందాల్సిన ప్రభుత్వ సహాయాన్ని చేరవేసేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. పెన్షన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారూ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE