e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ..

డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ గోడం నగేష్

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 10,

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో పర్యటించి, మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ నరేందర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతికి గల కారణాలను, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో ఇంజినీరింగ్ చీఫ్ జాదో ప్రకాష్, సూపరింటెండింగ్ ఇంజినీర్ రాథోడ్ శైలేంద్ర, స్థానిక సర్పంచ్ రాజు, రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యదర్శి జాదవ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE