e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి..

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 10, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, తమ భవిష్యత్తు, విద్య, లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తుందని, వాటికి అలవాటు పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – యంగ్ లీడర్స్ డైలాగ్ 2027’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘నషా ముక్త్ యువ భారత్’ అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

యువత దేశానికి బలమైన శక్తి అని, వారి ఆలోచనలు, ప్రతిభ, కృషిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, పట్టుదల, మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.

మత్తు పదార్థాల నియంత్రణతో పాటు యువతలో అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై తమ తోటి విద్యార్థులకు, సమాజంలోని ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE