e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

దుబార్‌పేట్‌లో నూతన వీవో భవన నిర్మాణానికి భూమిపూజ

దుబార్‌పేట్‌లో నూతన వీవో భవన నిర్మాణానికి భూమిపూజ

రూ.10 లక్షలతో భవన నిర్మాణ పనులకు శ్రీకారం.. మహిళా సంఘాల హర్షం

మన భారత్, ఇచ్చోడ: నవంబర్ 10, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దుబార్‌పేట్ గ్రామంలో నూతన వీవో (గ్రామ సంఘం) భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో మహిళా సంఘాలకు సౌకర్యవంతమైన సమావేశ వేదిక అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కత్లే ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామీణ మహిళల సంఘటిత అభివృద్ధికి వీవో భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళా సంఘాల సమావేశాలు, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఈ భవనం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

ఈ భూమిపూజ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిదం ఆనంద్ రావు, ఏపీఎం జదీశ్వర్, సీసీ మైమున్ బి, వీవోఏ మమత, వీవో గ్రామ అధ్యక్షురాలు వెడ్మ కమల నాగుబాయి, డ్వాక్రా సంఘాల మహిళలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

నూతన వీవో భవన నిర్మాణం పూర్తయితే గ్రామంలోని మహిళా సంఘాలకు సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు అవకాశం కలగనుంది. ఈ నిర్మాణం గ్రామ అభివృద్ధికి, మహిళల సంఘటిత పురోగతికి తోడ్పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE