e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

పెట్రోల్ బంకులో కనీస వసతులు కరువు.. ప్రజావాణిలో ఫిర్యాదు.

వాహనదారులకు ఎయిర్ కంప్రెసర్, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలి.

మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 09 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో వాహనదారులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ప్రజావాణి కార్యక్రమంలో నోడల్ అధికారి, ఎంపీడీవో సత్తయ్యకు, మండల తహసీల్దార్ ఆడెపు దివ్యజ్యోతికి ఫిర్యాదు పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ బంకులో వాహనదారులకు ఉపయోగపడే ఎయిర్ కంప్రెసర్ సౌకర్యం అందుబాటులో లేదని, మరుగుదొడ్లలో సైతం నీటి వసతి లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బంకులో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీటి సౌకర్యం లేదని, భోజన సమయంలో తాగునీరు సైతం అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వాహనదారులు, బంకులో పనిచేసే సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి, బంకులో అవసరమైన కనీస వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఒగ్గు బాలరాజు యాదవ్ అధికారులను కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE