e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

నారుమడిపై సీఎం రేవంత్ రెడ్డి పేరు రైతు పొలంలో వినూత్న అభిమానం!

వరి నారుతో ముఖ్యమంత్రి పేరు రాసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు దేవా రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ము 08 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని ఓ కాంగ్రెస్ నాయకుడు వినూత్నంగా చాటుకున్నారు. సాధారణంగా పుట్టినరోజు వేడుకలకు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా తన వ్యవసాయ పొలంలోని వరి నారుమడిపైనే ముఖ్యమంత్రి పేరును రాసి అందరి దృష్టిని ఆకర్షించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పోతుగల్ సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ బొందుగుల దేవారెడ్డి ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తన పొలంలో వేసిన వరి నారుమడిలో నారుతోనే ‘రేవంత్ రెడ్డి’ పేరును తీర్చిదిద్దారు. పచ్చని నారుమడిపై ముఖ్యమంత్రి పేరు ప్రత్యేకంగా కనిపించేలా ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఇలా వరి నారుమడిపై సీఎం పేరు రాయడం ఇది రెండోసారి కావడం విశేషం. వ్యవసాయ క్షేత్రంలోనే తన అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దేవారెడ్డి ఆలోచన స్థానికులను ఆకట్టుకుంది. పొలాల వైపు వెళ్లిన రైతులు నారుమడిలో రేవంత్ రెడ్డి పేరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అభిమానం చాటుకోవడానికి వేదికలే కాదు.. పచ్చని పంట పొలం కూడా ఓ ప్రత్యేక వేదికేనని బొందుగుల దేవారెడ్డి తన వినూత్న ఆలోచనతో నిరూపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE