e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

రూ.7.5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం..

రూ.7.5 కోట్లతో బంగారుగూడ డంపింగ్ యార్డ్ అభివృద్ధి పనులకు శ్రీకారం

చెత్త నిర్వహణకు ఆధునిక యంత్రాలు, ప్రత్యేక షెడ్ల నిర్మాణం – ఎమ్మెల్యే పాయల్ శంకర్

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచి, చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో ముందడుగు పడింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగూడ డంపింగ్ యార్డ్‌లో స్వచ్ఛ భారత్ మిషన్ నిధుల కింద రూ.7.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషతో కలిసి భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించే చెత్తను శాస్త్రీయ పద్ధతుల్లో వేరు చేసి, పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా చెత్తను వేరు చేసేందుకు ప్రత్యేక షెడ్ల నిర్మాణంతో పాటు ఆధునిక క్లీనింగ్ మెషినరీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

డంపింగ్ యార్డుల నిర్వహణ సరిగా లేకపోతే పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో డంపింగ్ యార్డుల కారణంగా వెలువడే దుర్గంధం, పారిశుధ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు.

మంజూరైన రూ.7.5 కోట్ల నిధులను అధికారులు సకాలంలో వినియోగించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు సమర్థవంతంగా పూర్తయితే, భవిష్యత్తులో పట్టణ పారిశుధ్య అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ఆదిలాబాద్ పట్టణం భవిష్యత్తులో మరింత విస్తరించి మహానగర స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయని, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

బంగారుగూడ డంపింగ్ యార్డ్‌లో చేపట్టనున్న ఈ ఆధునికీకరణ పనులు పూర్తయితే పట్టణంలో చెత్త సేకరణ, వేరు చేయడం, శుద్ధి ప్రక్రియలు మరింత పద్ధతిగా సాగడంతో పాటు పరిసర ప్రాంతాల్లో దుర్గంధ సమస్యను తగ్గించేందుకు అవకాశం ఏర్పడనుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE