e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

రెండు రోజులు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు..

దీపావళి, అమావాస్య సందర్భంగా రెండు రోజులు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

నవంబర్ 10 నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభం

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 6,

దీపావళి పండుగ, అమావాస్య సందర్భంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రెండు రోజులపాటు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పత్తి రైతులకు మార్కెట్ కమిటీ కార్యాలయం ద్వారా ప్రకటన విడుదల చేశారు.

ప్రకటన వివరాల ప్రకారం.. నవంబర్ 8వ తేదీ ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా, నవంబర్ 9వ తేదీ సోమవారం అమావాస్య సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు నిలిపివేయనున్నారు. ఈ రెండు రోజులు మార్కెట్ యార్డుకు సెలవు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.

కావున ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని పత్తి రైతులు ఈ విషయాన్ని గమనించి నవంబర్ 8, 9 తేదీల్లో తమ పత్తి సరుకును మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని మార్కెట్ కమిటీ సూచించింది. రైతులు ముందస్తుగా ఈ సమాచారాన్ని తెలుసుకొని మార్కెట్‌కు రావడం వల్ల కలిగే ఇబ్బందులను నివారించుకోవాలని కోరింది.

తిరిగి నవంబర్ 10వ తేదీ మంగళవారం నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. రైతులందరూ సెలవు తేదీలను దృష్టిలో ఉంచుకొని తమ పత్తి విక్రయాలకు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని, మార్కెట్ కమిటీకి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE