e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

సొంత నిధులతో ప్రయాణికులకు నీడనిచ్చిన కుటుంబం..

రూ.3.50 లక్షలతో ఖోడద్‌లో ప్రయాణ ప్రాంగణం నిర్మాణం

నవంబర్ 1న కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం.. ఏముల కుటుంబానికి గ్రామస్థుల అభినందనలు

మన భారత్, తలమడుగు: ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ముందుకు రావడమే నిజమైన సేవకు నిదర్శనమని నిరూపించారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన ఏముల కుటుంబ సభ్యులు. ప్రయాణికులు ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి, సొంత నిధులతో రూ.3 లక్షల 50 వేల వ్యయంతో ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించి ఆదర్శంగా నిలిచారు. గ్రామ ప్రజలకు, ప్రయాణికులకు ఉపయోగపడేలా చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఖోడద్ గ్రామంలో బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులకు సరైన నీడ, విశ్రాంతి సౌకర్యాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు ఎండలో, వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యను గుర్తించిన ఏముల కుటుంబ సభ్యులు ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా తమ సొంత ఖర్చులతో ప్రయాణ ప్రాంగణం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రూ.3.50 లక్షలు వెచ్చించి ప్రయాణికులకు ఉపయోగపడేలా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు.

కీ.శే. ఏముల శివారెడ్డి జ్ఞాపకార్థం నిర్మాణం

కీ.శే. ఏముల శివారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఏముల లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి తమ సొంత నిధులతో ఈ ప్రయాణ ప్రాంగణాన్ని నిర్మించారు. తమ తండ్రి జ్ఞాపకాలను ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమం ద్వారా చిరస్థాయిగా నిలపాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు గ్రామస్థులు అభినందిస్తున్నారు.

గ్రామానికి వచ్చే ప్రయాణికులకు నీడనివ్వడంతో పాటు బస్సుల కోసం వేచి ఉండే సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు ఈ ప్రాంగణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వ్యక్తిగతంగా నిధులు వెచ్చించి సౌకర్యం కల్పించడం అభినందనీయమని గ్రామ పెద్దలు ప్రశంసిస్తున్నారు.

నవంబర్ 1న కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

ఈ ప్రయాణ ప్రాంగణాన్ని నవంబర్ 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ప్రారంభించనున్నట్లు ఖోడద్ సర్పంచ్ ఏముల ప్రియాంక లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడం ద్వారా సమాజానికి సేవ చేయవచ్చని ఈ సందర్భంగా గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడకుండా సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన ఏముల లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డిల సేవా దృక్పథం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసిస్తున్నారు.

ప్రజల దైనందిన అవసరాలకు ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టడం ద్వారా గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందించిన ఏముల కుటుంబ సభ్యులకు ఖోడద్ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తండ్రి జ్ఞాపకార్థం చేపట్టిన ఈ సేవా కార్యక్రమం గ్రామ చరిత్రలో గుర్తుండిపోతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE