e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏపీ స్విచ్ ఏర్పాటు చేయాలి..

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏపీ స్విచ్ ఏర్పాటు చేయాలి

ప్రమాదాలు జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? – ఏనుగు రాకేష్ రెడ్డి

మన భారత్, జైనథ్:

జైనథ్ మండలంలోని కూర గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏపీ (AP) స్విచ్ ఏర్పాటు చేయకపోవడంతో గ్రామ ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏనుగు రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు లేదా మరమ్మతులు చేపట్టాల్సిన పరిస్థితుల్లో ఎల్‌సీ (లైన్ క్లియర్) కోసం విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదిస్తే లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్ స్పందిస్తూ ఏపీ స్విచ్ ఇవ్వడం కుదరదని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఏపీ స్విచ్ లేకపోవడం వల్ల విద్యుత్ పనులు చేపట్టే సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే ఏపీ స్విచ్ ఏర్పాటు చేస్తారా? అని విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించారు. ప్రజలు, రైతుల భద్రత దృష్ట్యా ముందుగానే అవసరమైన విద్యుత్ భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యపై గ్రామపంచాయతీ అధికారులను సంప్రదించగా, తమకు సంబంధం లేదని చెబుతున్నారని తెలిపారు. విద్యుత్ శాఖ, గ్రామపంచాయతీ మధ్య బాధ్యతల విషయంలో స్పష్టత లేకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు.

కూర గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిశీలించి, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అవసరమైన ఏపీ స్విచ్ ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ (SE) అధికారికి విజ్ఞప్తి చేసినట్లు ఏనుగు రాకేష్ రెడ్డి తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిడం రాకేష్,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE