e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రమాదకర గుంతల పూడ్చివేత.

హరిదాస్ నగర్ సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ చొరవ

సొంత ఖర్చులతో గుంతల పూడ్చివేత

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 30 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల -కామారెడ్డి ప్రధాన రహదారిపై హరిదాస్ నగర్, పదిర గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద ఏర్పడిన మూడు ప్రమాదకర గుంతలను ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పూడ్చివేశారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, గుంతల కారణంగా ప్రమాదాలకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన లయన్స్ క్లబ్ సభ్యులు సమస్య పరిష్కారానికి ముందుకొచ్చారు.లయన్స్ క్లబ్ సభ్యుడు, హరిదాస్ నగర్ గ్రామ సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకొని తన సొంత ఖర్చులతో సీసీ కాంక్రీట్ ద్వారా గుంతలను పూడ్చివేయించారు. ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాల ముప్పు తగ్గించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టారు.సామాజిక సేవలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి లయన్స్ క్లబ్ సభ్యులు ముందుకు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సద్ది లక్ష్మారెడ్డి, వంగ శ్రీకాంత్, బందారపు లక్ష్మారెడ్డి, మేస్త్రి కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE