e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన..

సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 30 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : మహిళల భద్రత, బాలల రక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా షీ టీమ్ తెలిపింది. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచనల మేరకు షీ టీమ్ బృందాలు ప్రతిరోజూ వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలోని ఎంపీయూపీఎస్, అల్మాస్‌పూర్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, అక్కపల్లి గ్రామంలోని ఎంపీయూపీఎస్ పాఠశాలలను షీ టీమ్ బృందం సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించింది.ఈ సందర్భంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, అత్యవసర సహాయ నంబర్ 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930, టీ-సేఫ్, షీ టీమ్ సేవలు, మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి వివరించారు.సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, ఇతర వివరాలు పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే భయపడకుండా షీ టీమ్ నంబర్ 87126 56425కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్ఐ ప్రమీల, రవి, సిబ్బంది శ్రీలత, శ్రీనివాస్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE