e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

డిటిఎఫ్ వీర్నపల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక.

మండల అధ్యక్షులుగా గాజంగి తుకారం,మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా ఖాజా మొయినాద

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 29 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో డిటిఎఫ్ కార్యవర్గ సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేశారు. అనంతరం డిటిఎఫ్ వీర్నపల్లి మండల శాఖ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వీర్నపల్లి డిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులుగా గాజంగి తుకారాం, మండల ప్రధాన కార్యదర్శిగా ఎండి ఖాజా మొయినాద్దీన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.ఇట్టి కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా బట్టారి సంపత్ కుమార్, ఎన్నికల పరిశీలకులుగా ఎం.విష్ణు ప్రసాద్, కార్యక్రమ ముఖ్య అతిథులుగా డి టి ఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీ అవురం సుధాకర్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల శాఖ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న సమస్యల పై స్పందిస్తూ పి ఆర్ సి నివేదికను వెంటనే తెప్పించుకొని దానిని అమలు చేయాలని,అదేవిధంగా వెనుకబాటు మండలమైన వీర్నపల్లి మండలంలోని అత్యధిక పాఠశాలలు ఒక ఉపాధ్యాయునితోనే కొనసాగుతున్నాయని అన్నారు. దీనివల్ల ఉపాధ్యాయులు, పిల్లలు ఇద్దరు నష్టపోతున్నారని తెలిపారు.ముఖ్యంగా మహిళలు సింగిల్ టీచర్ గా పనిచేస్తున్న పాఠశాలల్లో అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.వెంటనే ఈ పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించి సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE