e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

మంత్రి పొన్నంను కలిసిన గంభీరావుపేట నూతన ఏఎంసి పాలకవర్గం.

రైతుల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయాలని తెలిపిన మంత్రి.

రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 28 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ యాదవ్: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హైదరాబాద్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసి నూతన పాలకవర్గ సభ్యులు పరిచయం చేసుకున్నారు.ఈ సందర్భంగా గంభీరావుపేట మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ హమీద్, వైస్ చైర్మన్ భాస్కర్, డైరెక్టర్లు మంత్రిని కలిశారు. నూతనంగా నియమితులైన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. వారిని శాలువాలతో సత్కరించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల సంక్షేమానికి, మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE