e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

రైతుల సాగునీటి అవసరాలకు ప్రాధాన్యం..

మత్తడి వాగు కెనాల్‌కు సాగునీరు విడుదల

రైతుల సాగునీటి అవసరాలకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, తాంసి: తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి బుధవారం సాగునీటిని విడుదల చేశారు. పంటల సాగు కోసం నీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ నీటి విడుదలతో కొంత ఉపశమనం లభించనుంది.

ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న సాగునీటిని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

వ్యవసాయ రంగంలో ఎదురయ్యే ఇబ్బందులపై రైతులు ఆందోళన చెందకుండా సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రైతులు ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా సమస్యలు ఎదురైనప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు.

రైతుల సాగునీరు, పంటలు, వ్యవసాయ సంబంధిత సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని బోరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, వడ్డడి సర్పంచ్ జయసుధ గంగాధర్, ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌడాల సంతోష్, ఏఎంసీ మెంబర్ తాటి అశోక్, అలీమ్, ఖమ్రుద్దీన్‌తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE