e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, October 26, 2026

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే గండ్ర

యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల, మన భారత్ ప్రతినిధి:

చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించిన సీసీపీఎల్ (CCPL) క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదలతో పాటు జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దబ్బెట అనిల్, మాజీ జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధు, వంశీకృష్ణ, ఘనపురం మాజీ పీఏసీఎస్ చైర్మన్ కుమార్ యాదవ్, బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడు గూట్ల తిరుపతి, సర్పంచులు సిరిపెల్లి జంపయ్య, ఇంగిలి రాజేందర్, సీనియర్ నాయకులు చిలుకల రాయకోమురు, మూల శంకర్ గౌడ్, నల్ల రాజిరెడ్డి, దూదిపాల బుచ్చిరెడ్డి, గుండెపురెడ్డి రవీందర్ రెడ్డి, తడుక కుమార్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాభిమానులు, యువకులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE