e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, October 26, 2026

తెలంగాణ రక్షణ సేనలోకి గుడిహత్నూర్ మండల నాయకుల చేరిక

తెలంగాణ రక్షణ సేనలోకి గుడిహత్నూర్ మండల నాయకుల చేరిక

మన భారత్, గుడిహత్నూర్: అక్టోబర్ 25: గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు. ఊర్వేత రోహిత్, పెట్ల మహేందర్, మాణిక్ రావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. ముక్రా బి ఉపసర్పంచ్ భగవాన్ కూడా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్‌తో కలిసి జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం వారి ఆధ్వర్యంలో ‘చలో ఇంద్రవెల్లి’ పాటను విడుదల చేశారు.

అంబేద్కర్, కొమరం భీం విగ్రహాలకు నివాళులు

కార్యక్రమానికి ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కొమరం భీం విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగుతోందని అన్నారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రవేశపెట్టిన పాంచజన్య పథకాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని తెలిపారు.

గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అభివృద్ధిపై స్థానికుల ప్రస్తావన

రాథోడ్ బాపురావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానికులు గుర్తుచేసుకున్నారని నాయకులు తెలిపారు. ప్రస్తుతం మండలంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేదని కొందరు స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

గుడిహత్నూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు ఇతర పార్టీల నుంచి తెలంగాణ రక్షణ సేనలో చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE