e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 24, 2026

డ్రోన్ వినియోగం రైతులకు మేలు: ఎమ్మెల్యే

వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం రైతులకు ఎంతో ప్రయోజనకరం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 24, (మన భారత్):

భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండల రైతు వేదికలో సీఎస్‌ఆర్‌ నిధులతో అందజేసిన వ్యవసాయ డ్రోన్ పరికరాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ నీటితో పంటలకు మందులు, ఎరువులను సమర్థవంతంగా పిచికారీ చేయవచ్చని తెలిపారు. అలాగే రైతులు నేరుగా పురుగుమందులతో సంబంధం లేకుండా పిచికారీ చేసుకునే అవకాశం ఉండటంతో ఆరోగ్యపరమైన ఇబ్బందులను కూడా తగ్గించవచ్చని చెప్పారు. ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా రైతులకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి, పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు తదితరులు ,పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9160189521

User Name : user_name : పవన్ కళ్యాణ్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE