e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 13, 2026

విశ్రాంత ఉపాధ్యాయుల భవనం ప్రారంభం

నేరడిగొండలో విశ్రాంత ఉపాధ్యాయుల భవనం ప్రారంభం

ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.. విద్యార్థుల అభ్యున్నతికి విశ్రాంత ఉపాధ్యాయులు సహకరించాలి

మన భారత్, అక్టోబర్ 11, నెరడిగొండ: విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, పదవీ విరమణ అనంతరం కూడా తమ అనుభవంతో విద్యార్థులకు మార్గదర్శనం చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండల విశ్రాంత ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన భవనాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి సమాజ నిర్మాణంలో అత్యంత గౌరవప్రదమైనదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసినప్పటికీ వారి అనుభవం, జ్ఞానం సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

విశ్రాంత ఉపాధ్యాయులు తమకు వీలైన సమయంలో పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు విద్యా విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. విద్యార్థులు విద్యలో రాణించేందుకు, ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు తమ అనుభవాలను పంచుకోవాలని తెలిపారు.

నేరడిగొండ మండల విశ్రాంత ఉపాధ్యాయుల కోసం భవనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ భవనం ఉపాధ్యాయుల సమావేశాలకు, పరస్పర అభిప్రాయాల మార్పిడికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు, విద్యాశాఖ, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నెరడిగొండ మండల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విశ్రాంత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE