e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

డేరా కృష్ణారెడ్డికి ఘన సన్మానం..

డేరా కృష్ణారెడ్డికి ఘన సన్మానం.. శుభాకాంక్షలు తెలిపిన ఆడే గజేందర్

కాంగ్రెస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి: ఆడే గజేందర్

మన భారత్, బోథ్: అక్టోబర్ 6,

ఆదిలాబాద్ డీసీసీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇంచార్జిగా డేరా కృష్ణారెడ్డి నియమితులైన సందర్భంగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ జిల్లాలోని పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ విధానాలు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఫ్రంటల్ ఆర్గనైజేషన్లను గ్రామస్థాయి నుంచి మరింత క్రియాశీలకంగా తీర్చిదిద్దడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డేరా కృష్ణారెడ్డి నాయకత్వంలో పార్టీ అనుబంధ విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

డేరా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఫ్రంటల్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, ఆదిలాబాద్ ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్మే మహేందర్, మాజీ బోథ్ అసెంబ్లీ అధికార ప్రతినిధి యండి సద్దాం, రహిమొద్దీన్, సంజీవ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE